Mahaa Daily Exclusive

  గోదావరిలో ఒకే కుటుంబం ఆత్మహత్యాయత్నం..! పంచాయతీరాజ్‌ ఏఈ సహా ముగ్గురు గల్లంతు..

Share

  •  పంచాయతీరాజ్‌ ఏఈ సహా ముగ్గురు గల్లంతు.
  •  రాజమహేంద్రవరం సమీపంలో విషాద ఘటన.
  •  మనవడిని కాపాడిన మత్స్యకారులు.
  •  ముగ్గురి కోసం ముమ్మర గాలింపు

రాజమహేంద్రవరం, మహా.

తూర్పుగోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం సమీపంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినారు. ఈ ఘటనలో పంచాయతీరాజ్‌ శాఖ ఏఈ నూకరాజుతో పాటు ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య గోదావరిలో గల్లంతయ్యారు.

కుటుంబ సభ్యులు గోదావరిలోకి దూకిన సమయంలో నూకరాజు మనవడిని మత్స్యకారులు గుర్తించి రక్షించారు. బాలుడిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. మరోవైపు నూకరాజు, మీనా, సౌజన్య ఆచూకీ కోసం పోలీసులు, సహాయక బృందాలు గోదావరిలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి.

ఒక్కసారిగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గోదావరిలోకి దూకిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు దారితీసిన కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. కుటుంబంలో ఏవైనా సమస్యలు ఉన్నాయా? లేక ఇతర కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు. గల్లంతైన ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది.

Latest