Mahaa Daily Exclusive

  జగ్గంపేటలో ఘనంగా ఆత్మీయ సత్కార సభ – జ్యోతుల చంటిబాబు ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులకు సన్మానం

Share

కాకినాడ జిల్లా మహా :జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట గ్రామంలో శుక్రవారం సాయంత్రం మూడు గంటలకు ఆత్మీయ అనుబంధం వెల్లివిరిసింది. జగ్గంపేట మాజీ శాసనసభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ మెంబర్ జ్యోతుల చంటిబాబు ఆధ్వర్యంలో జగ్గంపేట వారి పార్టీ కార్యాలయంలో ప్రజా ప్రతినిధుల ఆత్మీయ సత్కార సమావేశం నిర్వహించారు, ఈ సమావేశంలో జగ్గంపేట నియోజకవర్గలో ప్రజా సేవలో గత ఐదేళ్లుగా భాగస్వాములైన ZPTC లు, MPTC లు,మరియు సర్పంచ్ లకు ప్రజా సేవలో వారి కృషిని గుర్తిస్తూ, వారికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఈ ఆత్మీయ సభను ఏర్పాటు చేయడం జరిగిందని, గత ఐదేళ్లుగా నిరంతర సేవలను ప్రజలకు అందిస్తూ వారి సమస్యలను జిల్లా వరకు కూడా తీసుకువెళ్లి వారికి ఇచ్చిన పనిని దిగ్విజయంగా పూర్తి చేసిన వారిని సత్కరించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగిందని మరియు తమతో కలిసి ప్రజా సేవ చేసిన ప్రతి ఒక్కరినీ ఎప్పటికీ మర్చిపోలేమని, పార్టీ కోసం వారు చేసిన త్యాగం వెలకట్టలేనిదని మాజీ శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు, తెలిపారు. ఈ కార్యక్రమంలో, ప్రజా ప్రతినిధులు, వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, జ్యోతులు చంటిబాబు అభిమానులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు..