Mahaa Daily Exclusive

  34 శాతం బీసీ రిజర్వేషన్ల జీవో రాజకీయ గిమ్మిక్కే….

Share

34 శాతం బీసీ రిజర్వేషన్ల జీవో రాజకీయ గిమ్మిక్కే.
• చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగ సవరణకు కేంద్రంపై ఒత్తిడి తేవాలి.
• వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ .

విజయవాడ, మహా.

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంటుందని తెలిసినా రాజకీయ ప్రయోజనం కోసమే జీవో జారీ చేశారని ఆయన ఆరోపించారు.
ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం ముందే న్యాయపరమైన పరిమితులను తెలుసుకుని కూడా 34 శాతం కోటాను ప్రకటించిందని విమర్శించారు. ఇప్పుడు హైకోర్టు జీవోలను రద్దు చేసిన తరువాత సుప్రీంకోర్టుకు వెళ్తామని ప్రభుత్వం చెబితే అది బీసీలను మరోసారి మభ్యపెట్టడమేనని ఆయన ఆరోపించారు. బీసీలకు అధిక రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బొత్స డిమాండ్ చేశారు. పార్లమెంటులో రాజ్యాంగ సవరణ జరిగేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లను కల్పించే మార్గాన్ని అన్వేషించాలని సూచించారు. బీసీ రిజర్వేషన్లను వైఎస్సార్‌సీపీ అడ్డుకుంటోందంటూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని బొత్స విమర్శించారు. బీసీలకు చట్టబద్ధంగా, న్యాయపరంగా నిలిచే విధంగా రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడానికి బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కారణంగా చూపకూడదని అన్నారు.