Mahaa Daily Exclusive

  ఏపీ విఆర్ఓ అసోసియేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక..

Share

  • ఏపీ విఆర్ఓ అసోసియేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక
  • రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కాకినాడ రూరల్ మండలం నుండి K. V. సత్యనారాయణ ఎన్నిక…….

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విఆర్ఓ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం విజయవాడలోని ఏపీ రాష్ట్ర రెవెన్యూ భవన్‌లో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షులుగా కోన ఆంజనేయ కుమార్ (చంటి), ప్రధాన కార్యదర్శిగా మద్దాల బాపూజీ ఎన్నికయ్యారు.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రతినిధులు పాల్గొన్న ఈ ఎన్నికల్లో ప్రతి జిల్లా నుంచి ఒక్కొక్కరిని వివిధ కేటగిరీలలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ క్రమంలో కాకినాడ జిల్లా, కాకినాడ రూరల్ మండలానికి చెందిన కేవీ సత్యనారాయణ కూడా రాష్ట్ర స్థాయి కార్యవర్గంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా స్థానం దక్కించుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా విఆర్ఓల సమస్యలు, హక్కులు, సంక్షేమం, ఉద్యోగ సంబంధిత అంశాలపై నూతన కార్యవర్గం సమిష్టిగా పనిచేయాలని ఎన్నికైన ప్రతినిధులు ఆకాంక్షించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు పలువురు అభినందనలు తెలిపారు.