కుషాయిగూడ, మహా : చంచల్ గూడ సెంట్రల్ జైల్లో.మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు చంచల్ గూడ సెంట్రల్ జైల్ పర్యవేక్షణ అధికారి నవాబ్ శివకుమార్ గౌడ్ హాజరై మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జీవిత ఖైదీలను ఉద్దేశించి నవాబ్ శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ పోషించిన కీలక పాత్రను, దేశం కోసం ఆయన చేసిన సేవలను, త్యాగాలను గుర్తు చేశారు.. గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను ప్రతి ఒక్క జీవిత ఖైదీ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. క్షణికావేశంలో నేరాలకు పాల్పడి జైలుకు వస్తే జైలులో నేర ప్రవృతి నుండి సత్పార్తన ఖైదీలుగా తీర్చిదిద్దడంలో జైలు అధికారులు కృషి చేస్తున్నారన్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఎంతోమంది వీర యోధులు, వీర వనితలు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా త్యాగం చేసినటువంటి త్యాగదనులని వివరించారు. ఈ కార్యక్రమంలో జైలు అధికారులు, జైలు సిబ్బంది, జీవిత ఖైదీలు పాల్గొన్నారు.








