ఉత్తమ అధ్యాపకుడు తమ్మిశెట్టికి ఘన సన్మానం
*కారేపల్లి కాలేజీలో అభినందన సభ
*రాష్ట్రస్థాయి బెస్ట్ లెక్చరర్ అవార్డు గ్రహీత కు శాలువాలతో సత్కారం..
కారేపల్లి, మహా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు అందుకున్న కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల హిస్టరీ లెక్చరర్ తమ్మిశెట్టి శ్రీనివాస్ ను కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, విద్యార్థులు గురువారం ఘనంగా సన్మానించారు. ప్రిన్సిపల్ విజయ కుమారి అధ్యక్షతన కళాశాలలో అభినందన సభ ఏర్పాటు చేసి శాలువాలతో సత్కరించారు. ఈ సభలో వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్ మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయిలో హిస్టరీ సబ్జెక్ట్ కు గుర్తింపు తెచ్చిన తమ్మిశెట్టి శ్రీనివాస్ ఈ కళాశాలలో ఉండటం ఇక్కడి విద్యార్ధుల అదృష్టమని తెలిపారు. విద్యార్ధులకు చరిత్రను అలవోకగా బోధించే తీరుతో తమ్మిశెట్టి ప్రత్యేకతను సంతరించుకున్నారని కొనియాడారు. విద్యార్ధులు అధ్యాపకులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తుందని వాటిని ఉపయోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డి జి ఓ జిల్లా ప్రధాన కార్యదర్శి మోదుగు వేలాద్రీ, అసోసియేట్ ప్రెసిడెంట్ మల్లెల రవీందర్, శాంతి నగర్ కళాశాల ప్రిన్సిపల్ గోవిందరావు,, చర్ల ప్రిన్సిపల్ నరేందర్,టి ఐ జి ఎల్ ఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డిపి గణేష్,
టేకులపల్లి ప్రిన్సిపల్ పవన్,
జిల్లా హౌసింగ్ బోర్డు అధ్యక్షులు శేషు ప్రసాద్, కారేపల్లి జూనియర్ కళాశాల అధ్యాపకులు,సుధారాణి, సాజిదా, కృష్ణవేణి, రమా,వేణు , దుర్గా ప్రసాద్ పార్థసారథి, యాకయ్య, వనిత బాబురావు, రాంబాబు,లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు,








