- గోవుల సంరక్షణ ప్రతి ఒక్కరి భాధ్యత
- బిజెపి రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు
వరంగల్ మహా ;
గో సమ్మాన్ అభియాన్ తెలంగాణ ఇంచార్జ్ సన్కాదిక్ దాస్ మహారాజ్ నేడు బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు ను మర్యాదపూర్వకంగా కలిసి తమ కార్యక్రమాలు, లక్ష్యాలను వివరించారు.
ఈ సందర్భంగా గోవుల సంరక్షణ కోసం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందించాలని కమిటీ సభ్యులు ప్రదీప్ రావును కోరారు. వారి వివరాలను, కార్యక్రమాల ఉద్దేశాన్ని తెలుసుకున్న ప్రదీప్ రావు గారు గోవుల సంరక్షణ కోసం చేపడుతున్న కార్యక్రమాలకు తన సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.
గోవుల సంరక్షణ అనేది ఒక్కరి బాధ్యత కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా భావించి ముందుకు రావాల్సిన అవసరం ఉందని ప్రదీప్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కమిటీ ప్రతినిధులు వరంగల్ జిల్లాలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, వివిధ సంస్థలు, గోశాలలు, గో సంరక్షణ కార్యకర్తలను కలిసి తమ కార్యక్రమాలను వివరించనున్నారని తెలిపారు.
వరంగల్ జిల్లాలో గోవుల సంరక్షణ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ ఈ కమిటీకి గో సమ్మన్ అభియాన్ కి సహకరించాలని, వారి కార్యక్రమాలకు అండగా నిలవాలని ఎర్రబెల్లి ప్రదీప్ రావు పిలుపునిచ్చారు.
వీరితోపాటు వరంగల్ ప్రబారి జంగా ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.








