Mahaa Daily Exclusive

  భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

Share

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

ప్రజల అవసరం నిమిత్తం కలెక్టరేట్‌ లో కంట్రోల్ రూమ్

సంప్రదించాల్సిన టోల్‌ఫ్రీ నంబర్ 18004253424 లేదా 9154252936

వరంగల్, కలెక్టరేట్ మహా ;

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు సూచించారు.
భారీ వర్షాల సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, లోతట్టు ప్రాంతాలు, చెరువులు, వాగులు, నాలాల సమీపంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

వర్షాల కారణంగా నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున వాగులు, కాలువలు, చెరువులు దాటే ప్రయత్నం చేయవద్దని తెలిపారు.
భారీ వర్షాల నేపథ్యంలో
జిల్లాలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నట్లు అయితే ప్రజల అవసరం నిమిత్తం టోల్‌ఫ్రీ నంబర్ 18004253424 లేదా 9154252936కు ఫోన్ చేసి సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు.

Latest