- ఎంజీఎం లో ఉద్రిక్త వాతావరణం
- టిఆర్ఎస్ శ్రేణులకు పోలీసులకు మధ్య తోపులాట వాగ్వివాదం
వరంగల్, ఎంజీఎం ;
ప్రశ్నించే గొంతులను అణిచివేయడమే కాంగ్రెస్ ప్రజాపాలనా… టిఆర్ఎస్ పార్టీ మాజీ చీఫ్ విప్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ..
ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ను అడ్డుకున్న పోలీసులు.
ఆదివారం ఎంజీఎం లోని ఆరోగ్యశ్రీ వార్డులో
పైకప్పు పెచ్చులు ఊడి రోగులు గాయపడిన పరిస్థితులు మరవకముందే మరల ఈరోజు ఆర్ ఐ సి యు వార్డులో పై కప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. విషయం తెలుసుకున్న వినయ్ భాస్కర్ ఎంజిఎం లోనికి వెళ్తున్న క్రమంలో
ఎంజీఎం గేటు వద్ద పోలీసులు అడ్డుకున్న పోలీసులను తోసుకుంటు టీఆర్ఎస్ శ్రేణుల సీఎం డౌన్ డౌన్ అంటూ టిఆర్ఎస్ నాయకులు స్లొగన్స్ ఇవ్వడంతో ఎంజీఎంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది








