Mahaa Daily Exclusive

  ఎంజీఎం ఆసుపత్రికి అనారోగ్యం వెెంటిలేటర్‌ పై పెద్ద ఆసుపత్రి

Share

*ఎంజీఎం ఆసుపత్రికి అనారోగ్యం వెెంటిలేటర్‌ పై పెద్ద ఆసుపత్రి

*ఆరోగ్య శ్రీ వార్డులో పై కప్పు కూలి రోగులకు గాయాలు

*ఘటనా స్థలాన్ని పరిశీలించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు

*బీజేపీ నేతలను అడ్డుకున్న పోలీసులతో వాగ్వివాదం

*ఆరోగ్యశాఖను గాలికొదిలేసిన మంత్రి రాజీనామా చేయాలి

వరంగల్, బ్యూరో మహా ;

ఉత్తర తెలంగాణకే తలమానికమైన, వరంగల్ నగరంలోని ప్రభుత్వ పెద్ద ఆసుపత్రి అయిన ఎంజీఎం ఆసుపత్రి కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనం వల్ల ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో వెండి లెటర్ పై ఉందని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఆదివారం ఎంజీఎం ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ వార్డులో అకస్మాత్తుగా ఆస్పత్రి పైకప్పు పెచ్చులు ఊడిపడి, చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.
ఈ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు సోమవారం బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ తో పాటు బీజేపీ నాయకులు ఎంజీఎం ఆసుపత్రికి చేరగా, ఆసుపత్రి ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా అడ్డుకోవాలని చూసిన పోలీసుల తో బీజేపీ నాయకులతో తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసుల ఆంక్షలను ధిక్కరిస్తూ బీజేపీ శ్రేణులు నిన్న ప్రమాదం జరిగిన ఆరోగ్యశ్రీ వార్డు ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడి వాతావరణంలో రోగులు పడుతున్న ఇబ్బందులను, భవన శిథిలావస్థను చూసి నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

*కాంగ్రెస్ కు కమిషన్ల పై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల పై లేదా*

అనంతరం జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పై, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల పై నిప్పులు చెరిగారు. స్థానిక కాంగ్రెస్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు కేవలం వారి పదవులు , కమిషన్ల పై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై, ప్రజల ప్రాణాల పై అస్సలు లేదని మండిపడ్డారు. నిరుపేద ప్రజలకు అత్యాధునిక ఉచిత వైద్యం అందించాల్సిన ఆరోగ్య శ్రీ వార్డులోనే పై కప్పు కూలి రోగుల ప్రాణాల మీదకు రావడం అధికారుల, పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు.

*రోగాలను కాపాడాల్సిన ఆసుపత్రే వెంటిలేటర్ పై ఉంది*

ప్రజలను రోగాల బారి నుండి కాపాడాల్సిన ఎంజీఎం ఆసుపత్రి, సోమవారం అధికారుల నిర్లక్ష్యం వల్ల తానే వెంటిలేటర్‌ పై ఉన్న దుస్థితికి చేరింది. కనీస మౌలిక వసతులు ఈ ఆసుపత్రిని చూసి వరంగల్ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు అని రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రోగులను కాపాడలేకపోతున్నఇటువంటి నిర్లక్ష్యపు అధికారుల పై వైద్య శాఖ పై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
గాయపడిన బాధితులకు ప్రభుత్వం మెరుగైన వైద్యంతో పాటు తగిన నష్టపరిహారం అందించాలని, ఆరోగ్యశాఖను గాలికొదిలేసిన ఆరోగ్యశాఖ మంత్రి రాజనర్సింహ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పై, వైద్య రంగంలో వారి వైఫల్యాలపై బీజేపీ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని గంట రవికుమార్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నం సతీష్ షా, జిల్లా ప్రధాన కార్యదర్శిలు బాకం హరిశంకర్, బన్న ప్రభాకర్, జిల్లా కార్యదర్శిలు గోకే వెంకటేష్, వెంకట్ రావు, వివిధ మోర్చా జిల్లా అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.