- అంగన్‌వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి – డీపీవో వినోద్ కుమార్
- గాదెపాడు పోషణమాసంలో పాల్గొన్నడీపీవో
కారేపల్లి,మహా:అంగన్ వాడీ కేంద్రాలను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి వినోద్ కుమార్ కోరారు. బుధవారం కారేపల్లి మండలం గాదెపాడులో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జరిగిన 9వ పోషణ మాసం కార్యక్రమంలో డీపీవో పాల్గొన్నారు. చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేయించారు. సర్పంచ్ భూక్యా రంజిత్ దంపతులచే గర్భిణీలకు సీమంత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా డీపీవో మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు, బాలింతలు పోషకాహారాం తినాలని, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. గర్భిణీలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్నారు. జైత్రాం తండాలలో కూడా పోషణమాసంను నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో సీడీపీవో ఉమా, ఎంపీఓ రవీంద్ర ప్రసాద్, జైత్రాంతండా సర్పంచ్ మూడు జయంతి, సూపర్‌వైజర్లు ఎం.రమణ, గీతబాయి, అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.








