Mahaa Daily Exclusive

  ఆర్ బీఐ బిగ్ షాక్ 2023 తరువాత వడ్డీ రేట్లు పెంపు మరింత బారం కానున్న ఈఎంఐ 

Share

ముంబై, మహా : భారతీయ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచి కస్టమర్లకు షాక్ ఇచ్చింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దాంతో రెపో రేటు 5.50 శాతానికి చేరింది. అక్టోబర్ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు రోజులపాటు సమావేశమై పలు విషయాలపై సమీక్ష నిర్వహించింది. ఈ సమావేశంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల ద్రవ్యోల్బణ ప్రమాదం, ముడి చమురు, ధరల పెరుగుదల, గ్లోబల్ ఆర్థిక ఒత్తిడులు వంటి అంశాలపై చర్చించారు. 2023 ఫిబ్రవరి తరువాత వడ్డీ రేట్లను పెంచడం ఇదే తొలిసారి.

మూడున్నరేళ్ల కిందట ఆర్ బీఐ రెపో రేటును పెంచింది. ఆ సమయంలో రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు (0.25%) పెంచి 6.50 శాతానికి తీసుకెళ్లింది. ఆ తర్వాత డిసెంబర్ 2024 వరకు రెపో రేటును అలాగే కొనసాగించారు. ఆపై 2025లో పరిస్థితులు కాస్త మెరుగుపడటంతో కేంద్ర బ్యాంక్ రెపో రేటును మొత్తం 4 విడతల్లో 125 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 5.25 శాతానికి దిగొచ్చింది. డిసెంబర్ 2025 తర్వాత ఇప్పటివరకు అంటే దాదాపు 10 నెలల పాటు రెపో రేటును అలాగే కొనసాగించిన తర్వాత, తాజాగా రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యోల్బణం వల్ల రెపో రేటు పెంచింది.

ఫిబ్రవరి 2025లో 25 బేసిస్ పాయింట్లు కోత విధించారు. దీంతో 5 ఏళ్ల విరామం తర్వాత మొదటిసారిగా ఆర్ బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దాంతో రెపో రేటు 6.50 శాతం నుంచి 6.25 శాతానికి దిగొచ్చింది. ఏప్రిల్ 2025లో 25 బేసిస్ పాయింట్లు రెండోసారి కోత విధించడంతో రెపో రేటు 6 శాతానికి తగ్గింది. జూన్ 2025లో 50 బేసిస్ పాయింట్ల మూడోసారి కోత విధించడంతో రెపో రేటు 5.50 శాతానికి చేరుకుంది. ఆ తరువాత డిసెంబర్ 2025లో నాలుగో కోత విధించారు. చివరిసారి రెపో రేటులో 25 బేసిస్ పాయింట్ల కోత విధించడంతో 5.25 శాతానికి దిగిరావడంతో వడ్డీలు చెల్లిస్తున్న వారికి ఊరట కలిగింది.

రేపో రేటు పెంచడం వల్ల ఏం జరుగుతుంది

రేపో రేటు పెంచడం వల్ల బ్యాంక్ లోన్స్ మరింత ఖరీదు కానున్నాయి. ఎందుకంటే ఆర్ బీఐ ఇతర బ్యాంకులకు అప్పు ఇచ్చే రేటునే రెపో రేటు అంటారు. ఇప్పుడు బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ నుండి లోన్ తీసుకోవడం మరింత బారంగా మారుతుంది. దాంతో వాటికి ఫండ్స్ ఖర్చు పెరగడం వల్ల బ్యాంకులు కస్టమర్లపై హోమ్ లోన్, కార్ లోన్ సహా పర్సనల్ లోన్‌లపై వడ్డీ రేట్లను పెంచుతాయి. కనుక రెపో రేటు పెరిగితే, వడ్డీ రేట్లు పెరిగి.. గతంతో పోలిస్తే ఈఎంఐపై ఎక్కువ ఖర్చు అవుతుంది.

మీరు ఒకవేళ ఫ్లోటింగ్ రేట్ పై లోన్ తీసుకుని ఉంటే బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడంతో పాటు మీ లోన్ నెలవారీ ఈఎంఐ చెల్లింపు మొత్తం కూడా పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో బ్యాంకులు ఈఎంఐ స్థిరంగా ఉంచి లోన్ చెల్లింపు మొత్తం వ్యవధిని సైతం పెంచుతాయి. అయితే, లోన్ తీసుకునే సమయంలో మీరు ఫిక్స్ డ్ రేట్ సెలక్ట్ చేసుకున్న కస్టమర్లపై ఆర్‌బీఐ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపదు.

ఎప్ డీలపై అధిక వడ్డీ

రెపో రేటు పెరిగితే మీ ప్రతి నెలా చెల్లించే ఈఎమ్‌ఐ పెరిగినప్పటికీ, దీనివల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. రెపో రేటు పెరగడం వల్ల బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసే కస్టమర్లకు లబ్ధి చేకూరుతుంది. దీనివల్ల డిపాజిటర్లకు అధిక వడ్డీ లభిస్తుంది.

ఈఎంఐ ఎంత మేర పెరుగుతుంది

రెపో రేటులో ఈ 0.25 శాతం (25 బేసిస్ పాయింట్లు) పెంపు వల్ల మీ బ్యాంక్ లోన్లపై వడ్డీ రేట్లు కూడా 0.25 శాతం పెరుగుతాయి. ఒకవేళ మీరు తీసుకున్న 50 లక్షల హోమ్ లోన్‌పై మీ ఈఎంఐలో దాదాపు రూ. 780 నుంచి రూ. 817 వరకు పెంపు ఉండవచ్చు. ప్రస్తుత వడ్డీ రేటును 7.50 శాతంగా భావిస్తే, రెపో రేటు 0.25 శాతం పెరిగిన తర్వాత అది 7.75% అవుతుంది. ఆ పరిస్థితిలో 20 ఏళ్లకు తీసుకున్న 50 లక్షల హోమ్ లోన్‌పై ప్రస్తుత రెపో రేటు ప్రకారం ఈఎమ్‌ఐ రూ. 777 మేర పెరుగుతుంది. గతంలో 7.50 శాతం వడ్డీ రేటు వద్ద నెలకు 40,280 రూపాయలు చెల్లించే వారు. ఇకనుంచి నెలవారీ ఈఎంఐ 41,057 కట్టాల్సి వస్తుంది. ఒకవేళ మీరు 50 లక్షల హోం లోన్ తీసుకుని, 25 ఏళ్లు టర్మ్ అయితే 7.50 శాతం వడ్డీ రేటు వద్ద ఈఎంఐ రూ. 37,766 అవుతుంది. ఇది గతంలో 7.50 వాతం వడ్డీ రేటు వద్ద రూ. 36,950 చెల్లించేవారు. రెపో రేటు మార్చిన ప్రతిసారి మీరు చెల్లించే వడ్డీ రేట్లు పెరుగుతాయి.