Mahaa Daily Exclusive

  నిబంధనలకు అనుగుణంగా ఉపాధి పనులు నిర్వహించాలి…

Share

  • నిబంధనలకు అనుగుణంగా ఉపాధి పనులు నిర్వహించాలి
  • వీబీజీ రామ్ జీ పనులు తనిఖీ చేసిన డీఆర్డీవో పీడీ శ్రీరామ్

కారేపల్లి, మహ : వీబీజీ రామ్ జీ పనులను ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించాలని డీఆర్డీవో పీడీ కే.శ్రీరామ్ అన్నారు. బుధవారం కారేపల్లి మండలం అప్పాయిగూడెంలో వీబీజీ రామ్ జీ క్రింద చేపడుతున్న నిరంతర కాంటూర్ కందకాలు (సీసీటీ) పనులను పీడీ తనిఖీ చేశారు. అప్పాయిగూడెం పాఠశాలలో చేపడుతున్న కమ్యూనిటీ సోక్ పిట్ పనులను పరిశీలించి, పనుల పురోగతి, నాణ్యత, పనుల నిర్వహణపై సంబంధిత సిబ్బందికి తగు సూచనలు చేశారు. పనులు వేగవంత చేయాలని ఆదేశించారు. ఉపాధీ కూలీలతో మాట్లాడారు. పని ప్రదేశంలో భద్రతా జాగ్రత్తలు పాటించాలని, అధికారులు మరియు సిబ్బంది ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ సందర్బంగా పనుల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను పీడీ శ్రీరామ్ దృష్టికి సర్పంచ్ దండు ప్రవీణ్ తీసుకెళ్లి వాటికి తగిన పరిష్కారాలు చూపించాలని కోరారు. మేట్ల కు సంబంధించిన పేమెంట్‌ను సకాలంలో చెల్లించాలని, అర్హత కలిగి అవసరం ఉన్న కుటుంబాలకు కొత్త జాబ్ కార్డులను మంజూరు చేయాలని కోరారు. పీడీ వెంట ఏపీడీ లు శ్రీదేవి, చలపతిరావు ఎంపీడీవో పద్మ, సర్పంచ్ దండు ప్రవీణ్, ఏపీవో కోటేశ్వరరావు ఈసీ సుధీర్, కార్యదర్శి కృష్ణవేణి, పాఠశాల హెచ్ఎం సత్యవతి, బీఎఫ్టీ లు వసంత్, రాంబాబు, పార్వతి, మేట్ అజ్మీరా సురేష్, హ్యాండ్ పంపుల మెకానిక్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.