Mahaa Daily Exclusive

  అంగన్ వాడీలు బహుళార్ధక సేవా కేంద్రాలు…

Share

  • అంగన్ వాడీలు బహుళార్ధక సేవా కేంద్రాలు
  • భాగ్యనగర్‌ తండాలో పోషణ మాసోత్సవాలు

కారేపల్లి,మహా:అంగన్ వాడీ కేంద్రాలు బహుళార్ధక కేంద్రాలుగా సేవలందిస్తున్నాయని ఐసీడీఎస్ కామేపల్లి ప్రాజెక్ట్ సీడీపీవో కే.ఉమ అన్నారు. జాతీయపోషణ మాసోత్సవాల సందర్భంగా శనివారం కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాలో అవగాహన కార్యక్రమాన్నినిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో ఉమ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం అందించటంతో పాటు చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందిస్తూ ఆరోగ్యకర సమాజానికి పునాదులు వేస్తుందన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. చిరుధాన్యాలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు, కూరగాయలు, పండ్లను నిత్య అహారంలో భాగం చేసుకోవాలని సూచించారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ సత్యశీల, వార్డు సభ్యులు వాంకుడోత్ గాంధీ, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.