Mahaa Daily Exclusive

  ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌ పాస్‌పోర్టుపై ఏసీబీ పిటిషన్‌..

Share

  • ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌ పాస్‌పోర్టుపై ఏసీబీ పిటిషన్‌
  • విదేశాలకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలంటూ కోర్టును ఆశ్రయించిన ఏసీబీ

హైదరాబాద్‌, మహా : ఫార్ములా-ఈ రేసు కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురు నిందితుల పాస్‌పోర్టులను ఇంపౌండ్‌ చేయాలని కోరుతూ ఏసీబీ కోర్టును ఆశ్రయించింది. ఐదుగురు నిందితుల్లో ఒకరు విదేశీ పౌరుడు కావడంతో ఆయన పాస్‌పోర్టుపై ఇక్కడి అధికారులు చర్యలు తీసుకునే అవకాశం లేదని ఏసీబీ పేర్కొన్నట్లు సమాచారం.

హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేసు నిర్వహణకు సంబంధించిన సుమారు రూ.55 కోట్ల నిధుల బదిలీలో నిబంధనల ఉల్లంఘన జరిగిందన్న ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్‌ ఏ1గా, అరవింద్‌కుమార్‌, బీఎల్‌ఎన్‌ రెడ్డి, గోవెడ కిరణ్‌ మల్లేశ్వరరావు తదితరులు నిందితులుగా ఉన్నారు. ఏసీబీ 2026 మార్చిలో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.

క్రిమినల్‌ కేసు కొనసాగుతున్న నేపథ్యంలో నిందితులు విదేశాలకు వెళ్లకుండా పాస్‌పోర్టులపై చర్యలు తీసుకోవడమే ఈ పిటిషన్‌ ఉద్దేశంగా కనిపిస్తోంది. అయితే పాస్‌పోర్టును ఇంపౌండ్‌ చేసే అధికారం పాస్‌పోర్ట్‌ అథారిటీకి ఉంటుందని న్యాయస్థానాల తీర్పులు పేర్కొన్నాయి.

కాగా, ఈ కేసులో తదుపరి విచారణను నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు అక్టోబర్‌ 30కు వాయిదా వేసింది.