- నిరుపేదలకు అండగా ప్రజా ప్రభుత్వం
- సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన మాజీ మంత్రి కొండా సురేఖ
వరంగల్, ఓసిటి మహా ;
మాజీ మంత్రి వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే కొండా సురేఖ వరంగల్ ఓసిటిలో గల క్యాంపు కార్యాలయంలో 61 లక్షల 61వేల రెండు వంద రూపాయల విలువ గల మొత్తం111 సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ పేద ప్రజల అనారోగ్యం కారణంగా చికిత్స చేయించు కోవడానికి అయ్యే వైద్య ఖర్చులతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ అండగా నిలుస్తుందని కొండా సురేఖ తెలిపారు. రాష్ట్రంలోని నిరుపేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తూ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా పేద ప్రజల సంక్షేమాన్ని ఆపకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు తెలిపారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స కోసం వైద్య ఖర్చులకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేద వర్గాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో కంటే ఎక్కువగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మీసాల ప్రకాష్, సీనియర్ నాయకులు గోపాల్ నవీన్ రాజ్, మాజీ కార్పొరేటర్లు, లబ్ధిదారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.







