Mahaa Daily Exclusive

  పండగ సీజన్‌ వేళ… ఏసీ, టీవీల రేట్ల షాక్…

Share

  • పండగ సీజన్‌ వేళ
  • ఏసీ, టీవీల రేట్ల షాక్
  • అక్టోబర్ 1 నుండి 8శాతం దాకా ధరల పెంపు

హైదరాబాద్ బిజినెస్ : పండగ సీజన్‌కు ముందు.. వినియోగదారులకు ప్రముఖ కన్జూమర్‌ ఎలక్ట్రానిక్‌ కంపెనీలు షాక్‌ ఇచ్చాయి. తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఎయిర్‌ కండీషనర్లు, ఎల్‌ఈడీ టీవీలు, వాషింగ్‌ మెషిన్లు సహా ఇతర గృహోపకరణాల ధరలను 5-8 శాతం మేర సవరించాయి. కొత్త ధరలు అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతల వల్ల రాగి, స్టీల్‌, క్రూడాయిల్‌ వంటి ముడి పదార్థాల ధరలు పెరగడం, రూపాయి విలువలో హెచ్చుతగ్గులు ఇందుకు కారణాలుగా కంపెనీలు తెలిపాయి. ఎయిర్‌ కండీషనర్ల ధరలను 5-8 శాతం పెంచినట్లు ఆయా సంస్థల ఎగ్జిక్యూటివ్స్‌ తెలిపారు. వాషింగ్‌ మెషిన్లు, ఎల్‌ఈడీ టీవీలు, రిఫ్రిజిరేటర్ల ధరలు 3-4 శాతం వరకు పెరిగాయి. ఈ నిర్ణయంతో పండగ సీజన్‌పై ప్రభావం పడుతుందని కొన్ని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేయగా.. మరికొన్ని కంపెనీలు ఇది తాత్కాలికమేనని అంటున్నాయి. ముడిపదార్థాల ధరలు పెరగడంతో ఏసీ, రిఫ్రిజిరేటర్ల ధరలను 5-8 శాతం పెంచినట్లు బ్లూ స్టార్ మేనేజింగ్ డైరెక్టర్ బి.త్యాగరాజన్ తెలిపారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలే ఇందుకు కారణమన్నారు. ఒక గోద్రెజ్ అన్ని కేటగిరీలపై ధరలను 5-7శాతం ధరలు సవరించింది. పండుగ సీజన్‌ ముందు ఈ పెంపు చేపట్టినప్పటికీ.. డీలర్లు, డిస్ట్రిబ్యూటర్ల వద్ద పాత ధరలకే కొనుగోలు చేసిన సరకు ఉందని కంపెనీలు తెలిపాయి.