Mahaa Daily Exclusive

  నన్ను బీజేపీ తరఫున పోటీ చేయమని జ్ఞానేశ్ కుమార్‌ ఆఫర్ ఇచ్చారు..

Share

  • నన్ను బీజేపీ తరఫున పోటీ చేయమని
    జ్ఞానేశ్ కుమార్‌ ఆఫర్ ఇచ్చారు
  • కేరళ మాజీ ఐఏస్ అధికారి సంచలనం
  • కేంద్రమంత్రి అవుతానన్న జ్ఞానేశ్

మహా : అగ్నికి ఆజ్యం పోసినట్లుగా కేరళం రాష్ట్ర మాజీ ఐఏఎస్ ఆఫీసర్..జ్ఞానేశ్ కుమార్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు కేరళ మాజీ ముఖ్య కార్యదర్శి జిజి థామ్సన్‌ మాట్లాడుతూ.. తాను 2016 లో కేరళ లో చీఫ్ సెక్రటరీగా పని చేస్తున్న సమయంలో జ్ఞానేశ్ కుమార్ తనను బీజేపీ టికెట్‌ పై పోటీ చేయమని కోరినట్లు వెల్లడించారు. ” 2016 లో నేను ఓ విమాన జర్నీలో ఉన్నప్పుడు జ్ఞానేశ్ కుమార్‌ నా ముందు ఈ ఆఫర్ పెట్టారు. నేను అదే సంవత్సరం రిటైర్ కావాల్సి ఉంది. నా ఫ్యూచర్ ప్లాన్స్ గురించి అడిగిన కుమార్.. 2019 లోక్ సభ ఎలక్షన్స్ లో కేరళ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయమని సలహా ఇచ్చారు. నేను కూడా యూనియన్ మినిస్టర్ అవుతానని నాతో చెప్పాడు. నాకు ఆసక్తి లేక అతని ఆఫర్ ను తోసిపుచ్చాను. బీజేపీ నాయకుల నుంచి కాకుండా ఓ ఐఏఎస్ నుంచి ఇలాంటి ఆఫర్ రావడంతో నాకు ఆశ్చర్యం వేసింది” అని జిజి థామ్సన్‌ వెల్లడించారు.