Mahaa Daily Exclusive

  కాంగ్రెస్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కోఆర్డినేటర్‌గా డేరా కృష్ణారెడ్డి..

Share

కాంగ్రెస్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కోఆర్డినేటర్‌గా డేరా కృష్ణారెడ్డి

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల కోఆర్డినేటర్‌గా ఇచ్చోడ మండలం బోరిగాం గ్రామానికి చెందిన డేరా కృష్ణారెడ్డిని నియమించినట్లు డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ తెలిపారు. ఏఐసీసీ, టీపీసీసీ సూచనల మేరకు ఈ నియామకాన్ని చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలను సమన్వయం చేస్తూ, పార్టీ కార్యక్రమాలను మరింత చురుగ్గా నిర్వహించేందుకు కృష్ణారెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.