Mahaa Daily Exclusive

  ఆదిభట్లలో 5 లక్షలు పలికిన గణనాథుడి లడ్డూ…

Share

  • ఆదిభట్లలో 5 లక్షలు పలికిన గణనాథుడి లడ్డూ…
  • లడ్డూను కైవసం చేసుకున్న ఈసీ దేవగౌడ్
  • దేవుని ఆశీర్వాదం ప్రజలపై ఉండాలన్న దేవగౌడ్

 

ఆదిభట్ల సెప్టెంబర్ 26 మహా:

ఆదిభట్లలో గణేష్ యూత్ ప్రతిష్ఠించిన గణనాథుడి లడ్డూను వేలం పాటలో, ఈసీ దేవగౌడ్ కైవసం చేసుకున్నాడు. ఆ యొక్క దేవుని ఆశీర్వాదం ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఈసీ దేవగౌడ్ అన్నారు.

జిహెచ్ఎంసి ఆదిభట్ల సర్కిల్, 55వ డివిజన్ ఆదిభట్లలో గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి లడ్డూ వేలంపాటలో రూ.5,01,000 పలికింది. హోరాహోరీగా సాగిన ఈ వేలం పాటలో స్థానికుడు ఈసీ దేవగౌడ్ ఈ లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా దేవగౌడ్ ను ఘనంగా సన్మానించిన, గణేష్ యూత్ నిర్వాహకులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం యూత్ సభ్యులు నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు పల్లె శ్రీనివాస్ గౌడ్, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.