Mahaa Daily Exclusive

  అనుమతులేవ్ అయినా నిర్మాణం పూర్తి.?

Share

  • అనుమతులేవ్ అయినా నిర్మాణం పూర్తి.?
  • రీవేరా ఫంక్షన్ హాల్ పై ప్రజావాణిలో ఫిర్యాదు
  • అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి
  • ఉపసర్పంచ్ కావ్య వెంకట్ రెడ్డి
  • నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి
  • గ్రామ వార్డు సభ్యులు నర్కుడి మహేందర్

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 21 మహా:
ఉప్పరిగూడ రెవెన్యూ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన, రీవేరా ఫంక్షన్ హాల్ పై చర్య తీసుకోవాలని, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్మయికి, ఉపసర్పంచ్ కావ్య వెంకట్ రెడ్డి, వార్డు సభ్యులు నర్కుడి మహేందర్, కొంగరి రవితేజ ఫిర్యాదు చేశారు. ఇబ్రహీంపట్నం కల్సా, ఉప్పరిగూడ రెవెన్యూ పరిధిలోని సివిఆర్ కళాశాల సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా, ప్రభుత్వ ఆదాయానికి గండికోట్టి రివేరా ఫంక్షన్ హాలును అక్రమంగా నిర్మించారని, గ్రామం ఉపసర్పంచ్ కావ్య వెంకటరెడ్డి, గ్రామ వార్డు సభ్యులు నరుకుడి మహేందర్, కొంగరి రవితేజలు ఆరోపిస్తూ సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే, రీవేరా ఫంక్షన్ హాల్ అక్రమ నిర్మాణానికి దారితీసిందని వారు ఆరోపించారు. అనుమతులు లేకుండా, ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమంగా నిర్మించిన ఫంక్షన్ హాల్ పై చర్యలు తీసుకోవాలని, పలుమార్లు గ్రామ కార్యదర్శి ఫిర్యాదు చేసిన పట్టించుకోని మండల అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు.