హెల్త్ ఇన్నోవేషన్స్‌కు తెలంగాణను హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి శ్రీధర్‌బాబు
* హైదరాబాద్‌లో ‘హోమా సీఎంఈ 2026’ జాతీయ సదస్సు ప్రారంభం
* ఉచిత మెటబాలిక్ కాలిక్యులేటర్ యాప్ ‘మెట్రిక్ ఎక్స్‌ప్లోరర్’ ఆవిష్కరణ
* ఐటీ, లైఫ్ సైన్సెస్ మేళవింపుతో ఆధునిక వైద్య సేవలు
హైదరాబాద్, మహా:
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వైద్య రంగానికి జోడించి, తెలంగాణను హెల్త్ ఇన్నోవేషన్స్‌కు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘హోమా సీఎంఈ 2026’ (HOMA CME 2026) జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘ది న్యూ పారాడైమ్’ పుస్తకాన్ని ఆవిష్కరించడంతో పాటు, ప్రపంచంలోనే తొలి ఉచిత మెటబాలిక్ కాలిక్యులేటర్ యాప్ ‘మెట్రిక్ ఎక్స్‌ప్లోరర్’ను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. టెక్నాలజీ వినియోగం ద్వారా ప్రజలకు నాణ్యమైన, వేగవంతమైన వైద్య సేవలను చేరువ చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
నగరంలో సమగ్ర హెల్త్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను ప్రభుత్వం బలోపేతం చేస్తోందని, ఇందులో భాగంగా ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలతో పాటు హెల్త్‌టెక్ స్టార్టప్‌లను వైద్య రంగంతో సమర్థంగా అనుసంధానిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. నూతన పరిశోధనల ఫలితాలు సామాన్యులకు సైతం అందేలా ‘ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల పరిధిలోని 50 మంది రోగులకు ప్రత్యేక ఉచిత ప్రొటోకాల్ వైద్య సేవలను అందించనున్నట్లు తెలిపారు.
మారుతున్న జీవనశైలి కారణంగా విస్తరిస్తున్న డయాబెటిస్, ఇతర మెటబాలిక్ సంబంధిత వ్యాధుల నియంత్రణపై వైద్య రంగం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు. రోగుల లైఫ్‌స్టైల్ డేటాను అధునాతన పద్ధతుల్లో విశ్లేషించడం ద్వారా దీర్ఘకాలిక రుగ్మతలను ప్రాథమిక దశలోనే గుర్తించి నివారించవచ్చని పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణ విభాగంలో సరికొత్త ఆలోచనలతో ముందుకొచ్చే ఆవిష్కర్తలకు, స్టార్టప్‌లకు ప్రభుత్వం అన్నివిధాలా వెన్నుదన్నుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ప్రజాారోగ్య పరిరక్షణలో వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని మంత్రి శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు.







