Mahaa Daily Exclusive

  బెంగళూరులో బాబు .. ఐటీ హబ్ లో ప్రారంభోత్సవానికి హాజరు…

Share

బెంగళూరు, మహా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం బెంగళూరులో పర్యటించారు. నగరంలోని ప్రముఖ ఐటీ హబ్ అయిన వైట్‌ఫీల్డ్‌లో అత్యాధునికంగా నిర్మించిన ‘ది ఎర్త్ సెంటర్’ అనే కమర్షియల్ ఆఫీస్ కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కూడా హాజరయ్యారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ‘విస్టా స్పేసెస్’ ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసింది. ఈ భవనాన్ని సుమారు 9 లక్షల చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో, 2 బేస్‌మెంట్లు, గ్రౌండ్ ఫ్లోర్‌తో కలిపి మొత్తం 8 అంతస్తులతో నిర్మించారు. కేవలం కాంక్రీట్ భవనంలా కాకుండా, ఉద్యోగులు ప్రకృతితో మమేకమై పనిచేసే వాతావరణాన్ని కల్పించేలా ‘బయోఫిలిక్ డిజైన్’ శైలిలో దీన్ని రూపొందించడం ప్రధాన ఆకర్షణ. ఈ డిజైన్ ఉద్యోగుల మానసిక ఉల్లాసాన్ని, ఉత్పాదకతను పెంచడానికి దోహదపడుతుంది. వీవర్క్, ది ఎగ్జిక్యూటివ్ సెంటర్ వంటి ప్రముఖ ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ ప్రొవైడర్లు ఇక్కడ తమ ప్రీమియం ఆఫీస్ సేవలను అందిస్తున్నాయి.