కారేపల్లి, మహ : ఆన్ లైన్ లావా దేవీలు నిర్వహించే సమయంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై కృష్ణ అన్నారు. బుధవారం కారేపల్లి లోనికస్తూర్భాగాంధీ బాలిక గురుకుల విద్యాలయంలో సైబర్ క్రైమ్ పై అవగాహన కార్య్రకమాన్నినిర్వహించారు. సోషల్ మీడియా లోఆకర్షణియమైన ప్రకటనలతో మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. వాట్సప్ లో వచ్చే లింక్ లను ఎట్టి పరిస్ధితిలో ఓపెన్ చేయవద్దని ఓపెన్ చేయటం ద్వారా సెల్ పోన్ మోసగాళ్ల బారిన పడి డబ్బులు కోల్పోయే అవకాశం ఉందన్నారు. రోడ్డు ప్రమాదలలో చనిపోవటానికి అజాగ్రత్త, హెల్మెంట్ లేకపోవటం తోనే అధికంగా ఉన్నాయని తెలిపారు. రోడ్డ ప్రమాదాల నివారణ చైతన్య కార్యక్రమంలో విద్యార్ధులు భాగస్వాములు కావాలని కోరారు. ఈకార్యక్రమంలో విద్యాలయం స్పెషల్ ఆపీసర్ జీ.ఝాన్సీసౌజన్య,ఉపాధ్యాయులు కే.కవిత, జీ.అన్నపూర్ణ, సిహెచ్. ఝాన్సీ, కృష్ణవేణి, విజయమమత తదితరులు పాల్గొన్నారు.








