Mahaa Daily Exclusive

  అమిత్‌ షా తెలంగాణ టూర్ క్యాన్సిల్….

Share

  • అమిత్‌ షా తెలంగాణ టూర్ క్యాన్సిల్
  • చివరి నిమిషంలో కీలక నిర్ణయం
  • నిరాశలో బీజేపీ శ్రేణులు
  • పర్యటనకు కారణాలు వెల్లడించని పార్టీ

హైదరాబాద్, మహా : కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దయింది. ఒక రోజు పర్యటన నిమిత్తం రేపు ఆయన రాష్ట్రానికి రావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. దానికి గల కారణాలేంటో అధికారికంగా వెల్లడికాలేదు. షెడ్యూల్‌ ప్రకారం అమిత్‌ షా శనివారం రాత్రి 9 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, లోక్‌భవన్‌లో బస చేయాల్సి ఉంది. ఆదివారం ఉదయం మెదక్‌, కరీంనగర్‌ జిల్లాల్లో ఆయన పర్యటిస్తారని, పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడంతో పాటు ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారని షెడ్యూల్ లో పేర్కొన్నారు. హోంమంత్రి పర్యటన కోసం మెదక్‌, కరీంనగర్‌ జిల్లాల యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలీసులు కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే పర్యటన రద్దుకు గల కారణం మాత్రం ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఢిల్లీలో అత్యవసర పరిణామాలు లేదా ఇతర అనివార్య కారణాల వల్లే పర్యటన రద్దై ఉండొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పర్యటన రద్దుతో బీజేపీ శ్రేణుల్లో నిరాశ నెలకొంది. అమిత్‌ షా తెలంగాణకు ఎప్పుడు వస్తారనే విషయాన్ని త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.