కారేపల్లి, మహ : అస్మిత సిటీ రగ్బీ లీగ్ పోటీలలో కారేపల్లి మైనార్టి గురుకుల విద్యారులు ప్రతిభ చూపారు. 29వ తేదిన ఖమ్మంలో సర్ధార్ పటేల్ స్టేడియంలో జరిగిన రగ్బీ అండర్-15 విభాగంలో రన్నర్-అప్‌గా నిలవగా, అండర్ -18 విభాగంలో 3వ స్థానంలో నిలిచి పతకాలు సాధించారు. ఈ సందర్భంగా శనివారం విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ డీ. సావిత్రి అభినందించారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మైనార్టీ గురుకుల విద్యార్ధులకు విద్యతోపాటు క్రీడలలో ప్రత్యేక తర్పీదు ఇవ్వటంతో వారి రాణిస్తున్నారన్నారు.ఈ సందర్బంగా విద్యార్థులకు శిక్షణ అందించి వారి ప్రతిభను వెలికితీసిన పీఈటీ, పీడీ లను అభినందించారు.








