Mahaa Daily Exclusive

  ఆర్ఎంపీ కుటుంబానికి గ్రామీణ వైద్యుల ఆర్థిక సాయం…

Share

 

కారేపల్లి,మహా:కారేపల్లి మండల మాదారం గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు పుల్లారావు మృతి చెందాడు. ఆయన సంస్మరణ కార్యక్రమంలో పెద్దమండవలో బుధవారం నిర్వహించారు. పుల్లారావు సంస్మరణ సభ కు గ్రామీణ వైద్యుల సహాయక సంఘం సింగరేణి మండల అధ్యక్షుడు గండమల వెంకటేశ్వర్లు, కార్యదర్శి సిలువేరు రమేష్ హాజరై పుల్లారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామీణ వైద్యుల సహాయక సంఘం మృతుని కుటుంబానికి ఆర్ధిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో మాధారం మాజీ సర్పంచ్ అజ్మీక నరేష్, గ్రామీణ వైద్యులు వి.వెంకటేశ్వర్లు, సతీష్, వేణు, లక్ష్మీనారాయణ, బాబురావు, రఫీ, ఉపేందర్, లక్ష్మణ్, రాజేష్, నరేష్,మోహన్‌రావు, మంగ్య,డి.రాజు,బి.రాజు, నాగచారి, సుమంత్, గిరిబాబు,బాబూలాల్, సర్దార్, నాగేందర్ ,కృష్ణ, కే.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.