Mahaa Daily Exclusive

  ప్రభుత్వ రైతు పధకాలకు పార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి……

Share

  • ప్రభుత్వ రైతు పధకాలకు పార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
  • పంటల నమోదు ఆధారంగా ఫలసాయం కొనుగోలు
  • కారేపల్లిలో ఎరువుల దుకాణాలను తనిఖి చేసిన ఏడీఏ

కారేపల్లి,మహా:కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టె రైతు పధకాలకు లబ్ధిచేకూరాలంటే రైతులుతప్పనిసరిపార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వ్యవసాయ శాఖ వైరా ఏడీఏ తుమ్మలపల్లి కరుణశ్రీ తెలిపారు. బుధవారం సింగరేణి మండలంలోని పలు ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో ఏడీఏ తనిఖీలు నిర్వహించారు. దుకాణాల్లో ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, విక్రయ వివరాలను పరిశీలించారు. ఎరువుల గోదాములను తనిఖీ చేసి పీవోఎస్ మిషన్ లో స్టాక్, రికార్డుల్లో చూపుతున్న నిల్వలకు పోల్చిచూశారు. పురుగుమందుల గడువు తేదీలు, వాటి నిల్వ, విక్రయాలకు సంబంధించిన వివరాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏడీఏ కరుణశ్రీ మాట్లాడుతూ రైతులకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రతి రైతు తప్పనిసరిగా నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. పంటల డిజిటల్ నమోదు ప్రక్రియ నడుస్తుందని పంట నమోదు చేసుకోవటం ద్వారా పంటఫలసాయాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు అమ్మటానికి ఇతర అవసరాలకుఅవసరమన్నారు. రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని, యూరియా అమ్మకాలతో పారదర్శకత కోసమే యాఫ్ ద్వారా అమ్మకాలు చేస్తున్నట్లుతెలిపారు. రైతులకు నాణ్యమైన ఎరువులు,పురుగుమందులు అందేలా డీలర్లు కృషి చేయాలని దీనిపై అధికారులు, విజిలెన్స్ తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు. ఏడీఏ వెంట మండల వ్యవసాయ అధికారి బట్టు అశోక్‌కుమార్‌, ఏఈఓ నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.