- ప్రధానోపాధ్యాయుడిపై ఎమ్మెల్సీ దురుసు ప్రవర్తన
- ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం
- క్షమాపణ చెప్పాలని డిమాండ్
హైదరాబాద్, మహా : ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీందర్‌రెడ్డిపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎమ్మెల్సీ పదవి గౌరవాన్ని మరిచి వ్యవహరించడం సరికాదని పేర్కొన్నాయి. రవీందర్‌రెడ్డికి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని కులాలకు చెందిన పేద విద్యార్థులు చదువుకుంటున్నారని సంఘాల ప్రతినిధులు తెలిపారు. విద్యార్థుల మధ్య కుల విభేదాలు రెచ్చగొట్టేలా వ్యవహరించడం తగదన్నారు. ఒక కులాన్ని విద్యార్థుల సమక్షంలో కించపరచడం సరికాదని పేర్కొన్నారు. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ప్రజాప్రతినిధి కులాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరించడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్సీ పదవికి గౌరవం లేకుండా వ్యవహరిస్తున్న తీన్మార్ మల్లన్నను పదవి నుంచి తొలగించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. రాజకీయ పార్టీల నేతలు వారి పదవులు ఐదు సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. కానీ ఉపాధ్యాయులు పదవి విరమణ పొందే ఎంతవరకు ఎంతోమంది విద్యార్థులకు విద్యను అందిస్తూనే ఉంటాడు. అలాంటి గురువులపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లయ్య దురుసు ప్రవర్తన సమాజానికి మంచిది కాదు. బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.








