Mahaa Daily Exclusive

  త్వరలోనే పార్టీ ప్రకటిస్తా…

Share

  • త్వరలోనే పార్టీ ప్రకటిస్తా
  • వైసీపీ నేతలది బూటకపు ప్రేమ..
  • మద్యం కేసులో నా పాత్ర లేదు
  • రాజ్‌ కసిరెడ్డే కర్త, కర్మ, క్రియ
  • మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి

విశాఖపట్నం, మహా : ప్రజలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు చూపిస్తున్న ప్రేమ బూటకమని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. మద్యం కుంభకోణం వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారానికి కర్త, కర్మ, క్రియ రాజ్‌ కసిరెడ్డేనని ఆయన ఆరోపించారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి పలు అంశాలపై మాట్లాడారు. త్వరలోనే కొత్త పార్టీ పేరును ప్రకటిస్తానని, అనంతరం పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. వైసీపీకి నష్టం కలిగించిన వారిలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. తనను జగన్‌ వద్ద దుర్మార్గుడిగా చిత్రీకరించిన వ్యక్తి సజ్జలేనని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చే వరకు తనను ఉపయోగించుకున్నారని, అనంతరం తనపై కుట్రలు, దుష్ప్రచారాలు జరిగాయని ఆయన అన్నారు. మూడు నెలల్లోనే తనను పార్టీ నుంచి పక్కన పెట్టారని ఆరోపించారు.

రాజధాని అమరావతికి తాను వ్యతిరేకం కాదని విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖను రాజధానిగా చేస్తామని చెప్పి వైసీపీ మాట మార్చిందని విమర్శించారు. “విశాఖను అభివృద్ధి చేస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చారు. ప్రజలకు క్షమాపణ చెప్పాలి” అని ఆయన అన్నారు. మద్యం కుంభకోణం కేసులో తనకు తెలిసిన విషయాలను అధికారులకు వివరించానని విజయసాయి తెలిపారు. ఈ కేసులో తన పాత్ర ఉందన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.