- నడిరోడ్డు పైనే నిలిపివేత.. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం!
- స్థానికుల పై ఆటో డ్రైవర్ల ఝాలూం!
- సెలవుల్లో అధికారి పట్టించుకోని ట్రాఫిక్ పోలీసులు
వరంగల్, బ్యూరో, మహా ;
వరంగల్ నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన పోచమ్మ మైదాన్ లో ఆటోల బీభత్సం రోజురోజుకూ పెరిగిపోతోంది. నడిరోడ్డు పైనే ఆటోలను అడ్డంగా నిలిపి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారు. అయినా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోకపోవడంపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారిక ఆటో స్టాండ్ ఉన్నప్పటికీ, నలుగురైదుగురు ఆటో డ్రైవర్లు తమ ఆటోలను ఏకంగా రోడ్డు మధ్యలోనే నిలిపి కొంతమంది ఆటో డ్రైవర్లు మద్యం సేవించి ఆటోలు నడపడమే కాకుండా ఆటోలో కూర్చుని గేమ్స్ ఆడుకుంటూ ఒక ఆటోను మరో ఆటో తో తోసుకుంటూ, స్థానికంగా ఉన్న వ్యాపార సముదాయాల ముందర నిలుపుతూ వారితో వాగ్వివాదానికి దిగుతూ
వెనుక నుంచి వచ్చే వాహనాలకు కనీసం దారి కూడా ఇవ్వడం లేదు.
ఈ ప్రాంతం నుంచి ప్రతిరోజూ వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఆటోలు ఇలా నడిరోడ్డు పై నిలపడం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ద్విచక్ర వాహనదారులు, పెద్ద వాహనాలు, అంబులెన్స్ లు కూడా వెళ్లలేక అవస్థలు పడుతున్నాయి.
మరో దారుణం ఏంటంటే – ఆటోల ఇష్టా రాజ్యాన్ని చూస్తూ కూడా అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ అధికారి ట్రాఫిక్ నియంత్రణ పై నిర్లక్ష్య ధోరణి జంక్షన్ల పై పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఆటో డ్రైవర్ల ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది. ప్రస్తుతం అధికారి సెలవుల్లో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.
ఇప్పటికైనా వరంగల్ పోలీస్ కమిషనర్ స్పందించి, పోచమ్మ మైదాన్ లో నిత్యం ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న ఆటోల పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, వ్యాపారులు కోరుకుంటున్నారు.







