- అనకాపల్లిలో అంతర్ రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
- రూ.5.5 కోట్ల విలువైన 43 కేజీల (లీటర్ల) హషిష్ ఆయిల్ స్వాధీనం
- ఐదుగురు నిందితులు అరెస్ట్, ఆటో, మోటార్ సైకిల్ స్వాధీనం.
అనకాపల్లి, మహా : జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వినియోగం పై ఉక్కుపాదం మోపుతున్న జిల్లా పోలీసులు మరో భారీ అంతరాష్ట్ర ముఠా గుట్టు రట్టు చేశారు. ఒడిస్సా నుంచి కేరళకు భారీ ఎత్తున తరలిస్తున్న రూ.5.5 కోట్ల విలువైన 43కేజీల ఆషిష్ ఆయిల్ ను పట్టుకొని అక్రమ రవాణా గుట్టు రట్టు చేశారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ వి.మాడుగుల ఎస్సై పోలీసులతో కలిసి మండల పరిధిలోని కోడూరు జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు . ఆ సమయంలో పాడేరు ఘాట్ రోడ్డు మీద అనుమానస్పదంగా వస్తున్న ఒక ప్యాసింజర్ ఆటో ఒక మోటార్ సైకిల్ ను తనిఖీ చేయగా ఈ 43 ప్యాకెట్ల హశిష్ ఆయిల్ పట్టుబడింది. వాహనంలో ఉన్న ఐదుగురు నిందితులు కేరళ రాష్ట్రానికి చెందిన రాజీవ్ కుమార్, ఒరిస్సా రాష్ట్రానికి చెందిన కైలా శరత్, దేశీ పలాసి, కేరళ రాష్ట్రానికి చెందిన కే. వినీష్ ఒడిస్సా రాష్ట్రానికి చెందిన ఖిలాకాములు ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఒడిస్సా రాష్ట్రానికి ముఠా మల్కనగిరి జిల్లా చిత్రకొండ పరిధిలోని మాలి గూడ దాబు గుడ ప్రాంతాల నుంచి హషిష్ ఆయిల్ సేకరించి పాడేరు ఘాట్ రోడ్డు మీదగా అనకాపల్లి నుండి కేరళలోని పాలక్కాడకు తరలించేందుకు పన్నాగం పన్నినట్లు తేలిందన్నారు. నిందితుల్లో ఒకరైన అరుణ్ కుమార్ కేరళ రాష్ట్ర పాలక కాడికి చెందిన వాడు పరారీలో ఉన్నాడన్నారు. ఇతను ఒడిస్సాలో రవాణా ఏర్పాటు చేసి నిందితులకు నగదు అందించి కేరళ వెళ్లిపోయాడని అతని కోసం గాలిపు చర్యలు చేపడుతున్నామన్నారు.
ఈ మెరుపు దాడి చేసిన పోలీసులకు ఎస్పీ రివార్డులు అవార్డులు అందించారు.








