Mahaa Daily Exclusive

  జపాన్ విద్య పర్యటన చేసిన అధ్యాపకుడుకి సన్మానం…

Share

  • జపాన్ విద్య పర్యటన చేసిన అధ్యాపకుడుకి సన్మానం
  • జపాన్ లో విద్యకు అధిక ప్రాధాన్యత

కారేపల్లి, మహ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధ్వర్యంలో జపాన్ ఎడ్యుకేషన్ ఎక్స్ ఫోజర్ కు కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుడు జే.దుర్గా ప్రసాద్ వెళ్లి అక్కడ విద్యా వసతులు పరిశీలించి తిరిగివచ్చారు. ఈసందర్భంగా దుర్గాప్రసాద్ ను కారేపల్లి కళాశాలలో అభినందన సభను ఏర్పాటు చేశారు. కళాశాల ప్రధానాచార్యులు విజయ కుమారి అధ్యక్షతన జరిగిని సభలో విశ్రాంత ప్రధానాచార్యులు కేఎస్ రామారావు, వాసిరెడ్డి శ్రీనివాస్, ఏనుకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సింహాచలం లు పాల్గొనిమాట్లాడుతూ దుర్గా ప్రసాద్ చేస్తున్న ప్రయోగాలు, పడుతున్న శ్రమ ను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం జపాన్ దేశానికి పంపారన్నారు. ఈసందర్భంగా అధ్యాపకుడు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన జపాన్ దేశం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అక్కడి విద్యా బోధన, వసతులను పరిశీలించిన ఆయన మన రాష్ట్రంలో అమలుకుసాధ్యసాధ్యాలను ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. మన విద్యార్ధులు ఉన్నత విద్యకు జపాన్ వెళ్లటానికి అనువైనదని, ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.