- ఉమెన్ ఏపీఎల్ ఛాంపియన్ గా
రాయలసీమ జెన్ స్టార్స్ - ఫైనల్ మ్యాచ్ కు ప్రత్యేక ఆకర్షణగా నిధి అగర్వాల్
మంగళగిరి, మహా
ఉమెన్ ఏపీఎల్ ఛాంపియన్ గా రాయలసీమ జెన్ స్టార్స్ జట్టు నిలిచింది. తొలి సీజన్ లోనే తిరుగులేని ఆధిపత్యంతో.. ప్లానింగ్ తో విజయతీరాలకు చేరింది. గోదావరి గోల్డెన్ ఈగల్స్ రన్నరప్ గా నిలిచింది. ఆది నుండీ అద్భుత ఆటతీరుతో రాయలసీమ జెన్ స్టార్స్ ప్రతి విభాగంలోనూ ఆధిపత్యం కనబరిచింది. ఈ జట్టుకు ప్రఖ్యాత నటి నిధి అగర్వాల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండగా, ఫైనల్ కు హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచింది. ఆంధ్రప్రదేశ్ లోని మహిళా క్రికెట్ కు ఈ సిరీస్ బూస్ట్ లా నిలిచింది. ఆరు వికెట్ల తేడాతో గోదావరి జట్లుపై రాయలసీమ నెగ్గింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ వినూత్న కార్యక్రమాల ద్వారా దేశంలోని క్రికెట్ అసోసియేషన్లలో ఒక ప్రత్యేక ఒరవడిని సాధించింది.








