- యువత స్వయం ఉపాధితో స్వశక్తిగా ఎదగాలి.! ఎమ్మెల్సీ
- పిఎంఈజిపి పథకాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలి
- డిజిటల్ ఆన్లైన్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి
- పట్నంలో నూతన ఈషా డిజిటల్ సేవా ఆన్ లైన్ సర్వీస్ సెంటర్
- ప్రజలు కేంద్ర ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకోవాలి
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 21 మహా:
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గ్రామస్థాయి నుండి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ ఏవీఎన్.రెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలోని ఎంబిఆర్ నగర్లో, చెరుకూరి జంగయ్య, కేంద్ర ప్రభుత్వం అందించిన పిఎంఈజిపి పథకం కింద నూతనంగా ఏర్పాటు చేసిన, ఈషా డిజిటల్ సేవా ఆన్ లైన్ సర్వీస్ సెంటర్ను, ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను యువత అందిపుచ్చుకోవాలని ఆయన అన్నారు. స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. డిజిటల్ సేవల వల్ల మనం చెల్లించే ప్రతి పైసాకు లెక్క ఉంటుందని, అక్రమ లావాదేవీలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రతి ఒక్కరూ పన్నులు చెల్లించే విధంగా ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందన్నారు. పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతోందని, వాటిని ఈషా డిజిటల్ సేవా కేంద్రం ద్వారా సులభంగా పొందవచ్చని తెలిపారు. కేంద్రం పేదల కోసం రొండు లక్షల గృహాలు మంజూరు చేసిందని, సోలార్ విద్యుత్ పథకం, ముద్ర లోన్స్, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్, రైతులకు ఫసల్ భీమా యోజన వంటి పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్ వంటి ప్రతిష్టాత్మక పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం సరిగా సద్వినియోగం చేసుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు బొక్క నర్సింహా రెడ్డి, బోసుపల్లి ప్రతాప్, కొప్పు బాషా, జక్కా రవీందర్ రెడ్డి, దొండ రమణారెడ్డి, బూడిద నర్సింహా రెడ్డి, ఎన్ను యాదగిరి రెడ్డి, దన్నే బాషయ్య, తాండ్ర రవీందర్, విజయ్ నాయక్, బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.








