కారేపల్లి, మహ: కారేపల్లి సోసైటీ మాజీ చైర్మన్ వల్లభినేని గురవయ్య(83)సోమవారం మృతి చెందారు. కారేపల్లి మండల విశ్వనాధపల్లికి చెందిన వల్లభినేని గురయ్య కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన పరిస్ధితి విషమించి మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారుడు వల్లభినేని రామారావు బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రవాణా శాఖ ఖమ్మం జిల్లా సభ్యులుగా కొనసాగారు. గురవయ్య మృతికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధులు ఫోనులో పరామర్శించారు. మృత దేహాన్ని సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు భాగం హేమంత రావు, గాంధీ, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, బీఆర్ఎస్ ఖమ్మం పట్టణ అధ్యక్షుడు పగడాల నాగరాజు, సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, మాజీ జడ్పీటీసీ ఉన్నం వీరేందర్, మాజీ వైస్ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, మాజీ సొసైటీ చైర్మన్ తోటకూరి శ్రీనివాసరావు, తాతా వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు తోటకూరి రాంబాబు, సూరపురెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, సోందు, సీపీఎం నాయకులు రేగళ్ల మంగయ్య, సైదులు తదితరులు సందర్శించి నివాళులు అర్పించారు.








