బాలాపూర్ సెప్టెంబర్ 20 మహా:
ఏఐసీసీ ఆదేశాలతో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, చిగురింత పారిజాత నరసింహారెడ్డిని, నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన బాలాపూర్ డివిజన్ అధ్యక్షులు నీరుడు శ్రీరాములు, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ మొద్దు కర్ణాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమేష్ కుమార్, నరాల విజయ్ కుమార్, వారికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు మాట్లాడుతూ… తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షురాలిగా నియమించిన సందర్భంగా పేరుపేరునా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులను కార్యకర్తలను కలుపుకొని సమన్వయం చేసుకుంటూ, వచ్చే జిహెచ్ఎంసి ఎన్నికలలో తమ వంతు కృషి చేస్తానని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు చేరేలా కృషి చేస్తామని, రంగారెడ్డి డిసిసి అధ్యక్షురాలు పారిజాత తెలిపారు.







