Mahaa Daily Exclusive

  జిల్లాలో అక్షరాస్యత పెంచడమే లక్ష్యం

Share

*జిల్లాలో అక్షరాస్యత పెంచడమే లక్ష్యం

*వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

*ఓపెన్ స్కూల్ అడ్మిషన్ డ్రైవ్

వరంగల్, మహా ;

అక్షరాస్యత శాతాన్ని పెంచే లక్ష్యంతో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి మహిళ, ప్రతి పురుషుడు ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌ ఉత్తీర్ణులయ్యేలా ఓపెన్ స్కూల్ అడ్మిషన్ డ్రైవ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ఐఏఎస్ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఓపెన్ స్కూల్ అడ్మిషన్లకు సెప్టెంబర్ 15వ తేదీతో గడువు ముగియనున్నందున, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ వెంటనే అడ్మిషన్ తీసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యాభ్యాసానికి మధ్యలో దూరమైన వారు ఓపెన్ స్కూల్ ద్వారా తమ విద్యను కొనసాగించి ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌ విద్యార్హతలు సాధించవచ్చని తెలిపారు.

విద్య ద్వారా వ్యక్తిగత అభివృద్ధితో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అర్హులైన వారందరికీ ఓపెన్ స్కూల్ అవకాశాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఏసీఎల్‌బీ వై.వి. గణేష్, బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ పుష్పలత, డీఈఓ రంగనాయుడు, అడల్ట్ ఎడ్యుకేషన్ డీడీ తుమ్మ రమేష్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ అనగోని సదానందం, ఉల్లాస్ వరంగల్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.