Mahaa Daily Exclusive

  మట్టి గణపతులను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం…

Share

*మట్టి గణపతులను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం

*వాల్ పోస్టర్‌ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్, కలెక్టరేట్ మహా ;

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతి విగ్రహాలను వినియోగించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు.
మట్టి గణపతుల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన వాల్ పోస్టర్‌ను గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించని మట్టి గణపతి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. రసాయనాలు, హానికరమైన రంగులతో తయారు చేసిన విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉందని తెలిపారు. మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు సహజ వనరులను కాపాడుకోవచ్చని పేర్కొన్నారు.

వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో పాటు పర్యావరణ హితంగా నిర్వహించాలని, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు విస్తృతంగా ప్రచారం చేపట్టాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో డియార్వో విజయలక్ష్మి,
పొల్యూషన్ కాలుష్య నియంత్రణ ఇ ఇ సునీత, రాజమణి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.