Mahaa Daily Exclusive

  ఖిలా వరంగల్ పడమర కోటలో తాగునీటి సమస్య..! తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు..

Share

  • పరిష్కరించని బల్దియా అధికారులు, పట్టించుకోని పాలకులు
  • తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు

ఖిలా వరంగల్ మహా ;

గ్రేటర్ వరంగల్ నగరంలో కొన్ని డివిజన్ల లో తాగునీటి సమస్య తీవ్రతరంగా మారింది. బల్దియా ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన అధికారుల సిబ్బంది నిర్లక్ష్యం ప్రజలకు అది శాపంగా మారింది. నగరంలో కొన్నిచోట్ల నెలలుగా మంచినీటి సరఫరా కావడం లేదని ప్రజలు మండి పడుతున్నారు. జిల్లాల కలెక్టర్లు, బల్దియా కమిషనర్ సమావేశాలు నిర్వహించి నగరంలో నీటి సరఫరా కు ఎటువంటి అంతరాయం కలుగవద్దని ఆదేశాలు జారీ చేసిన అవి అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సుమారు 25 సంవత్సరాల క్రితం ఖిలా వరంగల్ ప్రాంతంలో తీవ్ర తాగునీటి సమస్య ఏర్పడిన సమయంలో ప్రజలు అనేక ధర్నాలు, ఆందోళనలు చేయడం జరిగింది. ఆ పోరాటాల ఫలితంగా కిలా వరంగల్ మధ్యకోటలో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టారు. ఆ ట్యాంక్ నిర్మాణం తర్వాత కొంతకాలం, సుమారు మూడు సంవత్సరాల వరకు, ప్రజలకు నీటి సమస్య లేకుండా సక్రమంగా నీటి సరఫరా జరిగింది.

కానీ గత మూడు సంవత్సరాలుగా ఖిలా వరంగల్, ముఖ్యంగా పడమరకోట ప్రాంత ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతూ, ప్రైవేట్ వాటర్ ప్లాంట్లను ఆశ్రయించాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది.

*ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు*

మధ్య కోటలో వాటర్ ట్యాంక్ నిర్మించిన సమయంలో పడమరకోట కు నీరు అందించే కనెక్షన్‌ ను ఎవరి సమక్షంలో, ఏ కారణంతో తొలగించారు?
ఆ కనెక్షన్‌ ను స్థానిక కార్పొరేటర్ సమక్షంలోనా? సంబంధిత అధికారుల సమక్షంలోనా?
తొలగించడానికి సంబంధించిన అధికారిక నిర్ణయం లేదా అనుమతి ఎవరు ఇచ్చారు?
ప్రజలకు రాజకీయ ఆరోపణలు కాదు వాస్తవ సమాధానాలు రావాలి శాశ్వత పరిష్కారం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
పడమర కోటకు గతంలో ఉన్న నీటి సరఫరా కనెక్షన్‌ ను పరిశీలించి, అవసరమైతే పునరుద్ధరించి, ప్రజలకు క్రమం తప్పకుండా తాగునీరు అందించేలా బల్దియా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మంచినీరు ప్రతి కుటుంబానికి ప్రాథమిక హక్కు.
పడమరకోట ప్రజల నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం వచ్చే వరకు ప్రజలు మళ్లీ రోడ్లపై చెక్కి పోరాటాలు ధర్నాలు చేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు.

Latest