కారేపల్లి,మహా: బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ తీజ్ అని దుబ్బ తండ సర్పంచ్ ఆంగోత్ మాతృనాయ అన్నారు. తీజ్ పండుగ సందర్భంగా గ్రామంలో డీజే లను ఏర్పాటు చేసి బంజారా సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా తొమ్మిది రోజులుగా యువతులు భక్తిశ్రద్ధలతో తీజ్ పూజలు నిర్వహించి, నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేవతలకు నైవేద్యాలు సమర్పించి, బంజారా సంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు. ప్రకృతిని, పంటలను, పశుసంపదను గౌరవించే బంజారా సమాజంలో తీజ్ పండుగకు విశిష్ట స్థానం ఉందని సర్పంచ్ మంత్రు నాయక్ తెలిపారు. తీజ్ పండుగ ప్రజలందరినీ ఒక్కచోట చేర్చి ఐక్యతను చాటుతోందని అన్నారు
Post Views: 70







