Mahaa Daily Exclusive

  మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్యకు హైకోర్టులో ఉపశమనం..!

Share

  • మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్యకు హైకోర్టులో ఉపశమనం
  • బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

హైదరాబాద్, మహా : ఉపా కేసులో గడచిన ఎనిమిది మాసాలుగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్న మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్యకు హైకోర్టు ఉపశమనం కల్పించింది. పలు షరతులను విధిస్తూ బెయిల్ మంజూరు చేసింది. ప్రతి శుక్రవారం కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని ఆదేశించడంతో పాటు రూ.25 వేల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లు సమర్పించాలని ఆదేశించింది. మావోయిస్టు అగ్రనేత కట్టా రామచంద్రారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొని విప్లవ భావజాలాన్ని ప్రచారం చేశారంటూ ఎన్ఐఏ అరెస్టు చేసి ఉపా చట్టం కింద జైలుకు పంపించింది. డిసెంబర్ 21న జఫర్‌గఢ్‌లోని ఇన్నయ్య ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అనంతరం రిమాండ్‌కు తరలించింది. హైకోర్టు బెయిల్ మంజూరుతో 8 నెలల జైలు జీవితం తర్వాత ఇన్నయ్య బెయిల్‌ పై బయటకు రానున్నారు.

Latest