- జర్నలిజం పై జులుం సహించేది లేదు
- వర్ధన్నపేట ఎమ్మెల్యే తీరు పై వరంగల్ జర్నలిస్టుల నిరసన!
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తీరును నిరసిస్తూ వరంగల్ పోచమ్మ మైదాన్ జంక్షన్ లో జర్నలిస్టుల భారీ ఆందోళన, నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు తీరు పై వరంగల్ జర్నలిస్టులు భగ్గుమన్నారు. మీడియా సంస్థ దిష్టిబొమ్మ దహనానికి నిరసనగా పోచమ్మ మైదాన్ కూడలిలో జర్నలిస్టులు రోడ్డుపై బైఠాయించి నల్ల బ్యాడ్జీలతో భారీ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వరంగల్ తూర్పు పరపతి సంఘం అధ్యక్షులు నరేందర్ మాట్లాడుతూ.. ప్రశ్నించే నాలుగో స్తంభంపై ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యానికి దిగడం దారుణమన్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికి నాలుగు సార్లు జరిగాయని, పత్రికా స్వేచ్ఛను హరిస్తూ జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు తీరు పై వరంగల్ జర్నలిస్టులు భగ్గుమన్నారు. మీడియా సంస్థ దిష్టిబొమ్మ దహనానికి నిరసనగా పోచమ్మ మైదాన్ కూడలిలో జర్నలిస్టులు రోడ్డుపై బైఠాయించి నల్ల బ్యాడ్జీలతో భారీ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వరంగల్ తూర్పు పరపతి సంఘం అధ్యక్షులు నరేందర్ మాట్లాడుతూ.. ప్రశ్నించే నాలుగో స్తంభంపై ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యానికి దిగడం దారుణమన్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికి నాలుగు సార్లు జరిగాయని, పత్రికా స్వేచ్ఛను హరిస్తూ జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వార్తల పై ఏవైనా అభ్యంతరాలు ఉంటే చట్టబద్ధమైన మార్గాలు ఉన్నాయి తప్ప, ఇలా దిష్టిబొమ్మలు తగలబెట్టడం ప్రజాస్వామ్య సంప్రదాయం కాదని జర్నలిస్టు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని, ఎమ్మెల్యే క్షమాపణ చెప్పే వరకు తమ నిరసనలు ఆపబోమని ఆందోళనకారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ తూర్పు జర్నలిస్టులు కొరుకుప్పల నరేందర్, పెరుమాండ్ల మధుసూదన్, బండి రవి, మిట్టపల్లి నవనీత్, మహమ్మద్ అమీర్, చిన్నబాబు,ఈద శ్రీనాథ్, నీలం శివ, గంగరాజు, వంశీ , వెలుగందుల అజయ్ కుమార్, రాజు, భాగ్యరాజు, ప్రకాష్ , ప్రశాంత్, కృష్ణ, నరేష్, బేతి ఉమా శంకర్, కలికోట శ్రీధర్, యుగేందర్, జన్ను శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.








