కారేపల్లి మహా :పుశువులకు వచ్చే వ్యాధులను తొలిదశలోనే గుర్తిస్తే వ్యాధి నివారణ సులభం అవుతుందని మండల పశువైద్యాధికారి డాక్టర్ క్రాంతికుమార్ అన్నారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధవారం కారేపల్లి మండలం విశ్వనాథపల్లిలో ప్రత్యేక పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈశిబిరాన్ని సర్పంచ్ ఇస్లావత్ రాజు, ఉప సర్పంచ్ బొమ్మల ధనమ్మ లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈసందర్బంగా పశు వైద్యాధికారి మాట్లాడుతూ పశువుల్లో గర్భకోశ వ్యాధులను తొలిదశలో గుర్తించి చికిత్స అందించాలని సూచించారు. పశువుల ఆరోగ్య పరిరక్షణ, సంతానోత్పత్తి మెరుగుదల లక్ష్యంగా వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు ఆయనతెలిపారు. పశువులకు సమతుల్య పోషకాహారం, ఖనిజ లవణాలు అందించాలని తెలిపారు. ఎద లక్షణాలను సకాలంలో గుర్తించి సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేయించడం ద్వారా సంతానోత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచవచ్చన్నారు. సెక్స్ సార్టెడ్ సీమెన్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బొగ్గారపు ముఖర్జీ, గోపాలమిత్ర సూపర్వైజర్ వెంకటేష్, గోపాలమిత్రులు రేగళ్ల మంగయ్య, సురభి శ్రీకాంత్, సమ్మయ్య, మోత్కూరి రామారావు, రవి, గ్రామ పెద్దలు వల్లభినేని ప్రభాకర్, వడ్డె వెంకటేశ్వర్లు, తాతా అచ్చారావు, వడ్డె రమేష్, తమ్మినేని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.








