ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 15 మహా:
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, ఎంపీ పటేల్ గూడ, పరిధిలో గల విశ్వేశ్వరయ ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం రోజున ఇంజనీర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కె శివకుమార్ సైన్టిఫిక్ ఆఫీసర్ (డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటోమిక్ ఎనర్జి భారత ప్రభుత్వం) హాజరై మాట్లాడుతూ… కఠోర శ్రమతోనే విజయాలు సాధ్యమవుతాయని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్ దేవానంద్ (పిహెచ్ & ఎమ్ఈ, టిజి) మాట్లాడుతూ… ప్రతిభను మరింతగా నిరూపించుకుని సమాజానికి దేశానికి సేవ చేయాలని సూచించారు. సెక్రటరీ కె లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ… మోక్షం గుండం విశ్వేశ్వరయ్యని స్ఫూర్తిగా తీసుకొని కష్టపడే తత్వం ఉంటే విజయానికి చేరువవుతారని, ఆ మహానుభావుడు పేరుతోనే మన కళాశాలను నడుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ బి శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ డి రమేష్, హెచ్ ఓడీలు, ప్రొఫెసర్స్, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








