హసన్‌పర్తి, మహా ;
హనుమకొండ జిల్లా లోని ఎస్సార్ యూనివర్సిటీ భవన నిర్మాణ పనుల్లో ప్రమాదవశాత్తు ఇనుప రాడ్ తల ఫై పడి జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ కూలీ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు హసన్‌పర్తి ఇన్స్పెక్టర్ ఎ. మహేందర్ తెలిపారు.
జార్ఖండ్ రాష్ట్రం, లాతేహార్ జిల్లా, మురుపు పోస్ట్, బాలుగాడి గ్రామానికి చెందిన పప్పు కుమార్ (31) తన సోదరుడు గుడ్డు భుయ్య, తోటి మేస్త్రీ ప్రదీప్‌లతో కలిసి బతుకుదెరువు కోసం వరంగల్ కు వచ్చి ఎస్సార్ యూనివర్సిటీ భవన నిర్మాణంలో ఇనుప రాడ్ బెండింగ్ పనులు చేస్తున్నారు.
ఈ నెల 9 09 2026 ఉదయం సుమారు 7 30 గంటల సమయంలో భవనం 4వ అంతస్తు నుండి గ్రౌండ్ ఫ్లోర్‌కు, అలాగే గ్రౌండ్ ఫ్లోర్ నుండి 4వ అంతస్తుకు ఇనుప రాడ్లను రవాణా చేస్తుండగా, ప్రమాదవశాత్తు ఒక ఇనుప రాడ్ 4వ అంతస్తు నుండి కింద పడి పప్పు కుమార్ తలకు గుచ్చుకుని తీవ్రంగా తీవ్రగాయాలు కాగా పప్పు కుమార్‌ను వెంటనే అంబులెన్స్‌లో వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం డ్యూటీ వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 10 9 2026 రాత్రి 22:18 గంటల సమయంలో పప్పు కుమార్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటన పై మృతుని సోదరుడు గుడ్డు భుయ్య (38) శనివారం 12 09 2026 తేది హసన్‌పర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు హసన్‌పర్తి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ ఎ. మహేందర్ పేర్కొన్నారు.








