కారేపల్లి, మహ: సింగరేణి గ్రామపంచాయతీ లో సర్ (స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్) కార్యక్రమంలో నిర్వహిస్తున్న గ్రామ సభను జిల్లా అడిషనల్ కలెక్టర్ డాక్టర్ శ్రీజ బుధవారం తనిఖీ చేశారు. సర్ సర్వే సందర్భంగా వచ్చిన అభ్యంతరాలపై ఎలక్షన్ కమీషన్ ఓటర్లకు వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేసివాటి నివృత్తి కోసం బూత్ లవారిగా గ్రామసభలు నిర్విహిస్తున్నారు. ఎలక్షన్ కమీషన్ నోటీసులు అందుకున్న ఓటర్లు నోటీసులో తెల్పిన అభ్యంతరాలపై తగు పత్రాలుసమర్పించాల్సి ఉంటుంది. అభ్యంతరాల పరిశీలన కార్యక్రమాని పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ అధికారులతో పలు సూచనలు చేశారు. అర్హులైన ఓటరు పేరును ఎట్టి పరిస్ధితిలోను తొలగింపుకు గురికావద్దన్నారు. అభ్యంతరాల పరిశీలనలో మండల స్ధాయి అధికారుల పర్యవేక్షణ తప్పని సరిగా ఉండాలన్నారు. నోటీసులు అందుకున్న ఓటర్లు గ్రామసభకు వచ్చి తగు పత్రాలు సమర్పించేలా బీఎల్వో లు చైతన్యం చేయాలని కోరారు. ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమీషన్ వెబ్ సైట్ లో ఆన్ లైన్ చేయాలని ఆదేశించారు. ఆడినల్ కలెక్టర్ వెంట ఎంపిడీవో పద్మ, సర్పంచ్ మేదరి వీరప్రతాఫ్, కార్యదర్శి నెహ్రు తదితరులు ఉన్నారు.








