Mahaa Daily Exclusive

  వేటగాళ్ల ఉచ్చుకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బలి..! వెంకిట్యా తండాలో అలుముకున్న విషాదచాయలు..

Share

•విషాదంలో మాజీ ఎంపీపీ దేవులా నాయక్ కుటుంబం

•వెంకిట్యా తండాలో
అలుముకున్న విషాదచాయలు

కారేపల్లి, మహా :వేటగాళ్ల ఉచ్చుకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బలయ్యారు. బూర్గంపాడు మండలంలో పని చేస్తున్న బానోత్ నవీన్ విధినిర్వహణలో అశువులు బాసాడు. ఫారెస్ట్ ప్లాంటేషన్ లో వేటగాళ్లు అడవిజంతువుల వీటికోసం విద్యుత్ ఉచ్చులు అమర్చుతున్నారని సమాచారం రావడంతో నవీన్ తో పాటు మరో నలుగురు అటవీ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లిన సమయంలో ముందు ఉన్న నవీన్ కాలు వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
*విషాదంలో మాజీ ఎంపీపీ దేవులా కుటుంబం
విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్ మాజీ ఎంపీపీ దేవులానాయక్ కుమారుడు. కుమారుడిని కోల్పోవటంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో రోదిస్తుంది. స్వగ్రామమైన వెంకిత్యతండా లో విషాదచాయలు అలుముకున్నాయి.