Mahaa Daily Exclusive

  సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం

Share

  • నీటిలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృత్యువాత

సంగారెడ్డి, మహా : సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఉతకడానికి వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మనూరు గ్రామ శివారులో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒకే కుటుంబంలో ముగ్గురు మృ తి చెందడంతో కుటుంబ సభ్యు లు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు.

మనూరు గ్రామ శివారులో బట్టలు ఉతకడానికి వెళ్లిన నరసింహారెడ్డి (45), సంగమేశ్వర్ రెడ్డి (42), కృష్ణవేణి (38) ప్రమాద వశాత్తు నీటిలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న వారు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నరసింహా రెడ్డి, సంగమేశ్వర్ రెడ్డి మృతదే హాలను వెలికితీశారు. నీటిలో మునిగిన కృష్ణవేణిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా, చికిత్స పొందుతూ ఆమె కూడా మృతి చెందారు.

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అప్పటి వరకు తమతో ఉన్నవారు ఒక్కసారిగా విగతజీవులుగా మారడంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటా యి. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.