Mahaa Daily Exclusive

  యూపీ కేబినెట్ సంచలన నిర్ణయం నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని మోదీ పేరు

Share

న్యూఢిల్లీ, మహా : ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ బుద్ధ నగర్ జిల్లా జెవార్‌లో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు పెట్టాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. శుక్రవారం లక్నోలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. విమానాశ్రయానికి ‘నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, నోయిడా-జెవార్’గా పేరు మార్పు చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌కు ఈ భారీ ప్రాజెక్టును కానుకగా అందించినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎయిర్‌పోర్ట్ యూపీలోనే అతిపెద్దదిగా నిలవడమే కాకుండా, భవిష్యత్తులో దేశంలోనే అత్యంత కీలకమైన ఏవియేషన్ హబ్‌గా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని గ్లోబల్ కనెక్టివిటీ కేంద్రంగా మార్చడంలో ఇది మైలురాయిగా నిలుస్తుందని స్పష్టం చేశారు.